- కేంద్ర బలగాలు, సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు పోలీసులు భారీ బందోబస్త్ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్లలో పరిధిలోని సెంటర్ల వద్ద మూడంచెల భద్రత పెట్టారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వుడ్ పోలీసులు డ్యూటీలో ఉంటారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఐదుగురికి మించి గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అభ్యర్థులు, పాసులు ఉన్న ఏజెంట్లు మినహా ఇతరులను సెంటర్ల పరిసరాల్లోకి అనుమతించరు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ తరుణ్జోషి భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ అనంతరం ర్యాలీలు, బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. కౌంటింగ్ సెంటర్లు, పరిసరాలు మొత్తం సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నాయి.